విడుదలకి రెడీ అవుతున్న ‘రోమియో’

విడుదలకి రెడీ అవుతున్న ‘రోమియో’

Published on Oct 31, 2012 8:34 AM IST


ప్రముఖ దర్శకుడు ‘పూరీ జగన్నాద్’ కధ-మాటలు అందించిన చిత్రం ‘రోమియో’. అందుకే ఈ చిత్రానికి ‘పూరీ రాసిన ప్రేమ కధ’ అన్నది చిత్రానికి ‘ఉప శీర్షిక’ గా నిర్ణయించారు చిత్ర దర్శక,నిర్మాతలు. యువ కధానాయకుడు ‘సాయిరాంశంకర్’ హీరోగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ సమర్పణలో..మహర్షి సినిమా పతాకంపై నిర్మాత వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రోమియో’. పూరీ జగన్నాద్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన ‘గోపి గణేష్’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నాయికగా ‘అడోనికా’ కు ఇదే తొలి తెలుగు చిత్రం.

యూరప్ నేపధ్యంలో జరిగే ప్రేమకధా చిత్రమిది. యువతరం ‘ప్రేమ’ భావాలకు నిలువుటద్దం ఈ చిత్రం. న్యూయార్క్ నగరం నుంచి వచ్చిన కధానాయిక ‘అడోనిక’, ఇండియా నుంచి వచ్చిన ‘సాయిరాం శంకర్’ ఇరువురూ ‘యూరప్’ లో కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమ తదనంతర పరిస్థితులు..వీరి గమ్యం ఏ తీరాన్ని, ఎలా చేరిందన్నది ‘రోమియో; చిత్రమని దర్శకుడు ‘గోపి గణేష్’ తెలిపారు.

పూరీ జగనాద్ గారి కధ-సంభాషణలతో రూపొందుతున్న ఈ ‘రోమియో’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని గోపిగణేష్ అన్నారు, సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి ఓ బలం అన్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నవంబర్ నెలలోనే చిత్రం ఆడియో, అదే నెలలో చిత్రం విడుదల ఉంటాయని నిర్మాత వల్లూరి పల్లి రమేష్ తెలిపారు.

ఆలీ,సుబ్బరాజు,ప్రగతి ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్; పాటలు: భాస్కర భట్ల, విశ్వ,రెహమాన్; కెమెరా: పి.జి.విందా; ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్; ఆర్ట్: చిన్నా; యాక్షన్: వెంకట్; కాస్ట్యూమ్స్: శ్రీ; నృత్యాలు: రఘు, కధ-మాటలు: పూరీ జగన్నాద్, నిర్మాత: వల్లూరి పల్లి రమేష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిగణేష్

తాజా వార్తలు