డార్లింగ్ స్వామి దర్శకత్వంలో వస్తున్న యూత్ ఎంటర్టైనర్ సినిమా ‘రొమాన్స్’. ఈ సినిమాని జూలై మూడవ వారంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని మారుతీ సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ హీరోగా డింపుల్ , మానస హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతట విడుదల చేయడానికి ఈ సినిమా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి జె. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫిని అందించాడు.