బాలీవుడ్ లో రాకీభాయ్ డామినేషన్.!

మన దక్షిణాది నుంచి వచ్చిన భారీ చిత్రాల్లో బాలీవుడ్ లో తిరుగు లేకుండా జెండా ఎగరేసిన అతి తక్కువ సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “కేజీయఫ్”. ఈ చిత్రం నెలకొల్పిన ప్రకంపనలు అన్ని ఇన్నీ కావు.

విడుదల కాబడిన అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న చాప్టర్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా ఇంపాక్ట్ ఇంకా ఏ రేంజ్ లో ఉందో కూడా మరోసారి నిరూపితం అయ్యింది.

గత వారం హిందీలో టెలికాస్ట్ చెయ్యబడిన సినిమాల జాబితాలో కేజీయఫ్ చాప్టర్ 1 భారీ వ్యూవర్ షిప్స్ రాబట్టి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. గత ఆగష్టు రెండో వారం స్లాట్ లో టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రం 55 లక్షలు పైగా వ్యూవర్ షిప్స్ ను రాబట్టి అన్ని ఇతర బాలీవుడ్ సినిమాలకు మించి రెస్పాన్స్ ను రాబట్టి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దీనితో బాలీవుడ్ లో రాకీ భాయ్ డామినేషన్ ఇంకా అలానే ఉందని చెప్పాలి.

Exit mobile version