‘టాక్సిక్’ లీక్.. ఫిజిక్ తో షాకిచ్చిన రాకింగ్ స్టార్

Toxic

ప్రస్తుతం కన్నడ నుంచి రానున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో ఒకటే “టాక్సిక్”. టాలెంటెడ్ హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. యష్ నుంచి సెన్సేషనల్ హిట్స్ కేజీయఫ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి హైప్ ఉంది. ఇలా ఆలస్యం అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం అలా కొనసాగుతుంది.

ఇక ఈ సినిమా నుంచి ఓ క్రేజీ లీక్ ఇప్పుడు తన ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. సెట్స్ లో యష్ పై ఓ మ్యాడ్ సీన్ పై లీక్ బయటకి వచ్చింది. ఇందులో యష్ మొదటిసారి షర్ట్ లేకుండా స్టన్నింగ్ ఫిజిక్ తో ఆశ్చర్యపరిచినట్టు తెలుస్తుంది. స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ రాకీ భాయ్ మార్క్ యాటిట్యూడ్ లో కనిపిస్తుంది. దీనితో ఈ లీక్ సోషల్ మీడియాలో అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది. దీనితో టాక్సిక్ పై మరిన్ని అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

Exit mobile version