మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం “దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ”. ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ–కూతుళ్లు కలిసి నటించడం ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్. వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దర్శకుడు వంశీ కృష్ణ మల్లా
“దక్ష ఒక థ్రిల్లింగ్ స్టోరీ. మోహన్ బాబు గారితో పాటు పలువురు సీనియర్ నటులను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఇది నాకు గొప్ప అనుభవం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అని అన్నారు.
మంచు లక్ష్మి
“దక్ష కథను నాన్న గారు నాకు తీసుకొచ్చారు. అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేశాను. మోహన్ బాబు గారికి ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చాం. పాన్ ఇండియా స్టార్కాస్ట్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. మనోజ్ ఇచ్చిన సూచనలు సినిమా మెరుగుపరచడానికి సహాయం చేశాయి. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఇది వారికీ హ్యాట్రిక్ హిట్ కావాలి” అని చెప్పారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్
“నా మిరాయ్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇప్పుడు అక్క, నాన్న కలిసి నటించిన దక్ష విడుదల కాబోతోంది. మీరు ఈ సినిమాను కూడా పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా మరింత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.