రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా నటించిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేసిన ప్రమోషన్స్ ఈ చిత్రానికి ఎంతలా వర్కౌట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
వెంకీ మామని కూడా ఇన్వాల్వ్ చేసి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఆడియెన్స్ లో రీచ్ అయ్యేందుకు చాలా బూస్టప్ గా నిలిచాయి. అయితే ఇపుడు ఇదే ఫార్మాట్ ని మరో ఎంటర్టైనింగ్ దర్శకుడు వెంకీ కుడుముల ఫాలో అవుతున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన “రాబిన్ హుడ్” చిత్రానికి ఫాలో అవుతున్నారు.
రీసెంట్ గా పలు మేకింగ్ వీడియో లాంటివి కూడా రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ గా రంగంలోకి నితిన్ కూడా దిగిపోయాడు. ఒక ఫన్నీ ప్రమోషనల్ వీడియోతో మేకర్స్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు. దీనితో ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రమోషన్స్ లో వీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం ప్లాన్ ని ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.