సీనియర్ హీరో మరియు నటుడు రిషి కపూర్ రెండు రోజుల క్రితం అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన క్యాన్సర్ వ్యాధి కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై బాలీవుడ్ తోపాటు దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కాగా ఆయన భార్య నీతూ కపూర్ ఇంస్టాగ్రామ్ లో ఓ భావోద్వేగ ట్వీట్ పంచుకున్నారు. ఆయన ఫోటో షేర్ చేస్తూ ”మన కథ ముగిసింది” అని మెస్సేజ్ పెట్టారు.
ఆ సందేశం రిషి కపూర్ మరణం ఆమెను ఎంతగా బాదిస్తుందో, ఆయనంటే ఆమెకు ఎంత ప్రేమో తెలియజేస్తుంది. రిషి కపూర్ 1980 లో హీరోయిన్ నీతూ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 15 సినిమాలలో నటించారు. వీరి సంతానమే బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన రన్బీర్ కపూర్.
https://www.instagram.com/p/B_rNm83AwrX/