ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ రిషి కపూర్ ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం కన్నుమూయడంతో.. బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖుల సమక్షంలో ముంబైలోని చందన్‌వాడి స్మశానంలో ముగిశాయి. కాగా రిషి కపుర్ లాస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
వీడియో రిషి కపూర్ హాస్పిటల్ లో బెడ్ పై పడుకుని ఉంటే ఓ అభిమాని తన పాటతో రిషి కపుర్ ను అందపర్చడం.. ఆ అభిమాని గాత్రానికి రిషి కపుర్ సంతోషపడుతూ.. అతనిని దీవిస్తూ మెచ్చుకుంటూ ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియో రిషి కపుర్ లాస్ట్ వీడియో కాదట రెండు నెలల క్రితం రిషి కపూర్ హాస్పిటల్‌కు రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లిన సందర్భంలో ఈ వీడియో తీశారని తెలుస్తోంది.
రిషి కపూర్ కి కుటుంబసభ్యులు రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంతిమ వీడ్కోలు పలికారు.
Actually crying ????
His spirit n his voice still full of life.
Rest in peace sir #RishiKapoor ypu were loved. His last video ???? pic.twitter.com/4XpcVwTivh— Quirky Naari (@QuirkyNaari) April 30, 2020