సుశాంత్ కేసులో కీలక మలుపు, రియా జంప్..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసు విచారణ కొనసాగుతుంది. ముంబై పోలీసులు సుశాంత్ సన్నిహితులు, కొందరు దర్శక నిర్మాతలను కూడా విచారించడం జరిగింది. ఈ కేసులో ఫస్ట్ సస్పెక్ట్ గా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని పలుమార్లు విచారణకు పిలిచారు. రియా చక్రవర్తి అనేకమార్లు పోలీసు విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది . రియా చక్రవర్తి కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది.

సుశాంత్ తండ్రి రియాపై బీహార్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన బీహార్ పోలీసులు ఆమె కోసం ముంబైలోని తన నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే.. బీహార్ పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా లేని రియా ఇంటి నుంచి అదృశ్యమైనట్టు సమాచారం. దీంతో.. బీహార్ పోలీసులు ఆమె కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Exit mobile version