విభిన్న చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తను తీసే సినిమాతో వార్తల్లో నిలుస్తుంటారు, అలాగే సినిమాని రిలీజ్ కంటే ముందు బాగా ప్రమోట్ చేస్తారు. కానీ తాజాగా తన డైరెక్షన్లో వస్తున్న ‘ది అటాక్స్ అఫ్ 26/11’ సినిమాని మాత్రం ఎలాంటి పబ్లిసిటీ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే వర్మ దాదాపు అందరూ కొత్త వారితో ఈ సినిమా చేసాడు.
ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ ‘ నేను బిజినెస్ కోసం ఈ సినిమా చేయలేదు. నేను ముంబైలో జరిగిన అటాక్స్ చూసి ఎంతో షాక్ కి గురయ్యారు. ఆ ప్రమాదంలో గురైన వారందరికీ నా వంతు నివాళిగా ఈ సినిమాని తీశాను. ఈ సినిమాని హిందీ, తెలుగు భాషల్లో మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు.