మరోసారి గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఆర్.జి.వి మరో సినిమాను తీస్తున్నాడు. నేరాలకు అంతు అనేదే ఉండదు అన్నది ఈ కధకు మూలకధ. ఈ సినిమా పేరు ‘సత్య’. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనైకా శోటి, అంజలి గుప్తా, అమిత్రియాన్ పాటిల్ ప్రధానతారలుగా కనిపిస్తారు. ఈ సినిమా యొక్క మొదటి లుక్ మరియు కొత్త ప్రచారచిత్రాన్నీ నిన్న హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సినిమా గురించి మన క్రియేటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ “నాకు రౌడీలంటే చాలా గౌరవం. వాళ్ళు గనుక లేకపోతే నా కెరీర్ ఈరోజు ఇలా సాగేదికాదు.
బొంబాయిలో అండర్ వరల్డ్ నేపధ్యలో 1998లో నేను సత్య తీశాను. నేరాలకు అంతులేదు. పరిస్థితిని బట్టి వాటి రూపాలను మార్చుకుంటుంది. క్రైమ్ తన జీవితాశయంగా తీసుకున్న ఒక యువకుడి కధ ఇది. నేను నేరాలను సమర్దించడం లేదు. కానీ ఆ బాటలో ఉన్నవాళ్ళు అంటే ఇష్టం అని చెప్తున్నాన”ని తెలిపారు. సుమంత్ కుమార్ రెడ్డి నిర్మాత. వికాస్ శరఫ్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు నితిన్-సంజీవ్ దర్శన్ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు. జూలైలో ఈ సినిమా విడుదలకానుంది.