విడుదలైన ఆర్.జీ.వి ‘సత్య’ ఫస్ట్ లుక్

విడుదలైన ఆర్.జీ.వి ‘సత్య’ ఫస్ట్ లుక్

Published on Mar 2, 2013 5:10 PM IST

RGV

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఒక వింతే. ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ విడుదల అయిన మరుసటి రోజే తన తరువాత సినిమా సత్య ట్రైలర్ విడుదల చేసాడు. ముంబాయి వచ్చి అక్రమ కార్యకలాపాల కోసం కంపెనీ పెట్టి కోట్లు సంపాదిద్దాం అనుకునే పాత్రలో శర్వానంద్ కనిపించాడు. కేవలం ఒక్క సినిమాతో పుట్టగొడుగుల్లా అట్టడుగున వున్న వారి ఇమేజ్ ని ఆకాశాన్ని తాకించగల కీర్తి వర్మది. అతను తీసిన ‘శివ’ నాగార్జునకి గతాన్ని వెనుతిరిగి చుస్కోనివ్వకుండా చేస్తే, ‘గాయం’ జగపతి బాబు భవిష్యత్తుని బంగారంలా మలచింది. అందుకే ఈ సినిమాపై శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ ట్రైలర్లో శర్వానంద్ న్యూలుక్, వర్మ కెమెరా వర్క్ ప్రత్యెక ఆకర్షణగా నిలిచాయి. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ ముంబాయి గ్యాంగ్ ల నేపధ్యంలో కొనసాగింపుగా సాగే చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు