రాంగోపాల్ వర్మ ‘రౌడీ’ శివ సినిమాని పోలి ఉంటుంది

rowdy

వర్మ తొలి చిత్రం శివ, తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సినిమాలలో ఒకటి అని అంటే అందరూ అంగీకరిస్తారు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికి అభిమానులని అలరిస్తూనే ఉంటుంది. తాజా వార్తల ప్రకారం, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో, మోహన్ బాబు, మంచు విష్ణు నటిస్తున్న ‘రౌడీ’ సినిమాకి, శివ సినిమాతో సంబందం ఉందని తెలుస్తోంది.

వర్మ, తను శివ సినిమాలో తీసిన ‘సైకిల్ చేస్’ సన్నివేశాన్ని ‘రౌడీ’లో పెట్టడానికి చాలా ఆసక్తి చూపించారు. అంతేకాకుండా ఇందులోని సౌండ్ ట్రాక్ ని ఇళయరాజాకు అంకితం ఇచ్చారు. ఇటివల రాంగోపాల్ వర్మ మాట్లుడుతూ, ‘1989లో ‘సైకిల్ చేస్’కి ఇళయరాజా ఇచ్చిన నేపథ్య సంగీతాన్ని ఇప్పటికి మరిచిపోలేనని, అందుకే సాయి కార్తీక్ తో చెప్పి అదే నేపథ్య సంగీతం ‘రౌడీ’ సినిమాలోని 17వ ట్రాక్ లో పెట్టామని, అది చాలా బాగా వచిందని’ అన్నారు.

శాన్వి, జయసుధలు నటించిన ‘రౌడీ’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 4న విడుదల కానుంది.

Exit mobile version