రామ్ గోపాల్ వర్మ ‘సైకో’ రిలీజ్ డేట్

RGV

వివాదాస్పద డైరెక్టర్ గా పేరున్న రామ్ గోపాల్ వర్మ చాలా చిన్న విరామం తర్వాత తన కొత్త సినిమాకి ‘సైకో’ అనే టైటిల్ లో పెట్టి వార్తల్లో నిలిచాడు. కొద్ది నెలల క్రితమే ప్రకటించిన ఈ సినిమాని జూన్ 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ద్వారా కిషోర్ భార్గవ్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. కాలిబ్రే ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వివేకానంద్ అహుజ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాని సొసైటీలో ఒక మహిళ ఎదుర్కునే పలు సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు.

ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ ‘ ఒక అమ్మాయికి తన జీవితంలో చాలా మంది అబ్బాయిలు తారసపడుతుంటారు. వారిలో కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, వారిలో ఒకరితో ఆ అమ్మాయి ప్రేమలో కూడా పడొచ్చు. అలా వారి రిలేషన్ ఒక స్టేజ్ కి వచ్చే సరికి వారిలోని ఒకరిచేత ఆ అమ్మాయి వేధింపులకి గురవుతుంది. అలా వేధించే ఓ సైకో కథే ఇది. ఆ సైకోని ఆ అమ్మాయి ఎలా డీల్ చేసింది అనేదే సినిమా’ అని తెలిపాడు.

Exit mobile version