తెలుగులోకి తెరంగేట్రం చెయ్యనున్న బ్రెజీలియన్ బాంబ్

తెలుగులోకి తెరంగేట్రం చెయ్యనున్న బ్రెజీలియన్ బాంబ్

Published on Dec 11, 2012 2:00 AM IST


నటాలియ కౌర్ గుర్తుందా “డిపార్ట్ మెంట్” చిత్ర విడుదల సందర్భంలో రాంగోపాల్ వర్మ భారీగా ప్రశంసించిన ఐటెం భామ. ఆ చిత్రం విఫలం అవ్వడంతో ఈ బ్రెజీలియన్ భామ తెరమరుగయ్యింది. ముందుగా ఈ భామను మరియు రానా ప్రధాన పాత్రలలో ఒక చిత్రాన్ని కూడా చేస్తానన్న రాంగోపాల్ వర్మ ఈ చిత్ర పరాజయం తర్వాత “26/11 ముంబై దాడులు” చిత్రాన్ని తెరకెక్కించడంలో నిమగ్నమయ్యారు . ప్రస్తుతం రాంగోపాల్ వర్మ శిష్యుడయిన జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న “దళం” చిత్రంలో ఐటెం సాంగ్ తో ఈ బ్రెజీలియన్ భామ తెలుగులోకి అరంగేట్రం చేయ్యనుంది. నక్సలిజం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో నవీన్ చంద్ర మరియు పియా బాజ్పాయి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. జేమ్స్ వసంతాన్ సంగీతంలో నటాలియా కౌర్ నృత్యం చేసిన ఐటెం సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు