బిజినెస్ మేన్ సినిమాని హిందీలో చేస్తానంటున్న వర్మ

బిజినెస్ మేన్ సినిమాని హిందీలో చేస్తానంటున్న వర్మ

Published on Mar 14, 2012 9:05 AM IST


విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు మాస్ దర్శకుడు పూరి జగన్నాధ్ కలిసి తెలుగులో మహేష్ బాబు నటించి విజయవంతమైన ‘బిజినెస్ మేన్’ చిత్రాన్ని హిందీలో రేమీక్ చేయనున్నారు. ఈ రిమేక్లో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ ధ్రువీకరించాడు. తెలుగులో భారీ విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు అనే వార్త తెలిసాక సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ‘నేను పూరి జగన్నాధ్ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బిజినెస్ మేన్ సినిమాని అభిషేక్ హీరోగా హిందీలో చేయబోతున్నాము’ అని ఈ రోజు ఉదయం ట్విట్టర్లో తెలిపాడు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరి పలు తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు