వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా మీడియాకి దూరంగా ఉన్నారు కానీ ఆయన ఎక్కువ కాలం రూమర్స్ కి దూరంగా ఉండలేకపోయారు. ప్రస్తుతం వర్మ శర్వానంద్, అనైక నటిస్తున్న సత్య 2 సినిమాకి చివరి దశ మెరుగులు దిద్దుతున్నారు. తాజాగా ఆయన సవిత భాభి పై సినిమా తీఅయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2000 సంవత్సరం టైంలో కామిక్ బుక్ పాత్రల్లో బాగా పాపులర్ అయిన పేరు సవిత భాభి. అప్పట్లో యువత మొత్తం ఈమె ఆన్ లైన్ కామిక్ సీరీస్ ని బాగా ఫాలో అవడంతో ఆమె బాగా ఫేమస్ అయ్యింది.
గత కొద్ది నెలలుగా బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బాగా పాపులర్ అయిన ఈ పాత్రని బేస్ చేసుకొని సినిమా చేయ్యనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఈ వార్తల్ని ఖండించడమే కాకుండా ఆ వార్తలు పబ్లిష్ చేసిన పేపర్ కి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ‘ బొంబాయి టైమ్స్ నేను సవిత భాభి మీద సినిమా తీసుతున్నానని రాసిన దానిలో నిజం లేదు. అసలు ఎవరు చెప్పారు ఇది.. రిపోర్టర్ నన్ను అడిగి తెలుసుకోవాల్సిందని’ ట్విట్టర్ లో క్లారిఫై చేసాడు. ప్రస్తుతం వర్మ సత్య 2 తర్వాత ఎలాంటి సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. సత్య 2 సినిమాని తెలుగు, తమిళ్, హిందీ బాషలలో రిలీజ్ చేయనున్నారు.