జనవరి 17న రేయ్ ఆడియో లాంచ్

జనవరి 17న రేయ్ ఆడియో లాంచ్

Published on Jan 7, 2014 11:16 PM IST

Rey-New-Posters-1
జనవరి 17న శిల్పకళావేదికలో రేయ్ ఆడియో లాంచ్ జరగనుంది. ఈ సినిమా దర్శకనిర్మాత అయిన వై.వి.ఎస్ చౌదరి ఈ నెల 5న ఆడియో లాంచ్ అవుతుందని తెలిపినా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది 100రోజుల పండగను పురస్కరించుకుని ఈ వేడుకను వాయిదావేశారు.

ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ లను చౌదరి గారు అల్లు అర్జున్ చేత ఈ నెల 8న విడుదల చేయించనున్నాడు. ఎవడు సినిమాలో ఈ సినిమా ట్రెయిలర్ ను విడుదలచెయ్యనున్నారు. జనవరి 17 పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆడియో రిలీజ్ జరగనుంది. ఈ సినిమాలో సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరోయిన్స్

చక్రి సంగీత దర్శకుడు. చౌదరి గారు దర్శకనిర్మాత. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదలచేస్తారు

తాజా వార్తలు