సాయిధరమ్ తేజ్ ను హీరోగా వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమా ‘రేయ్’. కరేబియన్ దీవుల నేపధ్యంలో అమెరికా, హైదరాబాద్, బ్యాంకాక్, ట్రినిడాడ్ &టొబాగో ప్రాంతాలలో తెరకెక్కించారు. ‘ఫీలర్’ అనే పేరుతో చౌదరిగారు సాయిధరమ్ తేజ్ డ్యాన్స్ ను మనకు పరిచయం చేశాడు.
రానున్న రోజుల్లో రెండు కొత్త ట్రెయిలర్లతో సినిమాలో ‘ఏ టు జెడ్’ ను పరిచయం చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం చెయ్యనున్నాడు. అన్నీ అనుకున్నట్టే జరిగితే డిసెంబర్ చివరివారంలో ఆడియో రిలీజ్ జరగనుంది. ఈ సినిమాలో సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరోయిన్స్
చక్రి సంగీత దర్శకుడు. చౌదరి గారు దర్శకనిర్మాత. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదలచేస్తారు