వై.వి.ఎస్ చౌదరి తీస్తున్న ‘రేయ్’ సినిమా ఆడియో విడుదల వేడుక మరోసారి వాయిదాపడింది. ఈ వేడుక మమోలుగా జనవరి 5న విడుదలకావల్సివుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన వాయిదాపడింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారు
ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయంకానున్నాడు. ఈ లవ్ స్టోరీలో డ్యాన్సర్ పాత్రను మన హీరో పోషించాడు. నిర్మణాంతర కార్యక్రమాలలో బిజీగా వున్న చౌదరిగారు సినిమా పై చాలా నమ్మకంగా వున్నాడు. చక్రి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో చాలా భాగం హైదరాబాద్, బ్యాంకాక్, అమెరికా, కరేబియన్ దీవుల లో తీశారు. ఫిబ్రవరి 5న ఈ సినిమా మనముందుకు రానుంది.