ఓజీ కోసం ఆద్య.. సంతోషంగా ఉందంటున్న రేణు దేశాయ్..!

ఓజీ కోసం ఆద్య.. సంతోషంగా ఉందంటున్న రేణు దేశాయ్..!

Published on Sep 26, 2025 1:54 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఓజీ నేడు వరల్డ్‌వైడ్ థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు అందరూ ఆసక్తిగా థియేటర్లకు వెళ్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నిన్న(సెప్టెంబర్ 24) హైదరాబాద్‌లో పెయిడ్ ప్రీమియర్స్‌ను వీక్షించేందుకు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ వెళ్లారు. ఈ జాబితాలో పవన్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా సినిమా చూసేందుకు వెళ్లారు. వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే, ఆద్య ఇలా సినిమాలకు వెళ్లడంపై ఆమె తల్లి రేణు దేశాయ్ తాజాగా స్పందించారు. ఆద్య తన అన్నయ్య అకీరాతో సినిమాను చూసేందుకు ఉత్సాహంగా వెళ్లడం చూసి సంతోషంగా ఉంది. ఆమె అప్పుడే ఇంతలా ఎదగడం తనకు సంతోషాన్నిచ్చింది అంటూ ఆమె కామెంట్ చేశారు.

తాజా వార్తలు