లెజెండ్ ఎన్.టి.ఆర్ కి నివాళులు

లెజెండ్ ఎన్.టి.ఆర్ కి నివాళులు

Published on Jan 18, 2013 12:00 PM IST

NTR
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రేమతో అన్నగారు అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి 17వ వర్దంతి ఈ రోజు. జనవరి 18 1996లో హార్ట్ అటాక్ తో ఆయన మరణించారు. సుమారు 3 దశాబ్దాలు తెలుగు సినిమా ప్రపంచంలో తెలుగు సినిమా మాట్నీ ఐడల్ గా నిలిచారు. ఎన్.టి.ఆర్ నటుడిగా నటనలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసారు.

అలాగే పౌరాణిక, జానపద సినిమాలు చేయడంలో తనదే అగ్రస్థానం అని చెప్పుకోవాలి. ఉదాహరణకి ‘పాతాల భైరవి’, మాయా బజార్’, ‘దాన వీర శూర కర్ణ’, ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’ ఇలా ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు. రాముడు – కృష్ణుడు గా ఆయన పెర్ఫార్మెన్స్ , పౌరాణిక సినిమాలు తీయడంలో తెగువారికి ఒక ప్రత్యేక స్థానాన్ని అందించాయి. రావణబ్రహ్మ, దుర్యోధనుడు లాంటి నెగటివ్ పాత్రలను కూడా ఒక హీరోలా చేసారు.

కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలయిన ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’ ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’, ‘రాముడు – భీముడు’, ‘ వేటగాడు’, ‘కొండవీటి సింహం’ లాంటి సినిమాలతో ఎన్.టి.ఆర్ మాస్ ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారారు. ఒక్క నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

తెలుగు కమ్యూనిటీకి స్వార్ధ పూరిత స్వభావం లేకుండా అశేష సేవలందించిన ఎన్.టి.ఆర్ తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఆయన 17వ వర్దంతి సందర్భంగా ఆయనని తెలుగు సినిమా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎన్.టి.ఆర్ గారికి నివాళులర్పిస్తున్నాం.

తాజా వార్తలు