2వ వర్దంతి సందర్భంగా ఇ.వి.వి సత్యనారాయణ గారికి నివాళులు

2వ వర్దంతి సందర్భంగా ఇ.వి.వి సత్యనారాయణ గారికి నివాళులు

Published on Jan 21, 2013 3:23 PM IST


ఈ రోజు తెలుగు ఫేమస్ కామెడీ డైరెక్టర్ ఇ.వి.వి సత్యనారాయణ రెండవ వర్దంతి. 2011 జనవరి 21న హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. ఇ.వి.వి సత్యనారాయణ గారు ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలను, కమర్షియల్ హిట్ సినిమాలను తీసారు. డైరెక్టర్ గానే కాకుండా ఇండస్ట్రీలో మనసున్న మనిషిగా కూడా ఆయనకు పేరుంది. ఇ.వి.వి సత్యనారాయణ గారు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలను తీసారు.

అందులో ‘హలో బ్రదర్’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘అప్పుఅల్ అప్పారావు’, ‘అల్లుడా మజాకా’, ‘వారసుడు’, ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘జంబ లకిడి పంబ’ ఇలా ఎన్నో సినిమాలున్నాయి. అలాగే ఇ.వి.వి సత్యనారాయణ తన వారసులైన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లతో ‘ఎవడి గోల వాడిది’, ‘కితకితలు’ మొదలైన సినిమాలను తీసారు.

ఇ.వి.వి సత్యనారాయణ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే మేము మీ సినిమాలను బాగా మిస్ అవుతున్నాం.

తాజా వార్తలు