మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన లాంగ్ అవైటెడ్ చిత్రం “అనగనగా ఒక రాజు” కూడా ఒకటి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అలాగే మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ అనౌన్స్ చేస్తూ ఒక వీడియో వదిలినపుడు కూడా అంతే రేంజ్ బజ్ వచ్చింది.
మరి మళ్ళీ అప్పుడు నుంచి ఈ గ్యాప్ తర్వాత మేకర్స్ ఫైనల్ గా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై ఇపుడు క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ చిన్న ప్రోమో కట్ లాంటిది రిలీజ్ చేసి ఈ ఎంటర్టైనర్ ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై రేపు మే 26 సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకి అప్డేట్ ఇస్తున్నట్టుగా రివీల్ చేశారు. సో ఈ అవైటెడ్ సినిమా ఎప్పుడు అనేది రేపు క్లారిటీ రానుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
#AnaganagaOkaRaju Release Date Announcement tomorrow at 4:06 PM ⏳@NaveenPolishety @Meenakshiioffl #Maari @MickeyJMeyer pic.twitter.com/qBffnCAEw7
— Naga Vamsi (@vamsi84) May 25, 2025