అల్లు అర్జున్ – సుకుమార్ -దేవి కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. పైగా ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, సాంగ్స్ అన్నీ పూర్తి సంతృప్తిగా ఉండనున్నాయని.. పుష్పతో దేవి మ్యూజిక్ లో మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తాడని అంటున్నారు మేకర్స్. పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది.
ప్రస్తుతం దేవి ఐటం సాంగ్‌ను కంపో చేసే పనిలో ఉన్నాడట. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు. ఇక కరోనా అనంతరం స్టార్ చేయబోయే షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారట. మరి ‘పుష్ప’ సినిమాతో బన్నీ – సుకుమార్ మరో భారీ హిట్ కొడతారా చూడాలి. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.