కోలీవుడ్ సినిమా నుంచి ఇపుడు రాబోతున్న భారీ హైప్ ఉన్న అవైటెడ్ చిత్రం ‘కూలీ’ కోసం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనేకమంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇక రిలీజ్ కి దగ్గరకి వస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా రజినీకాంత్ కెరీర్లో సహా తమిళ నాట రికార్డు మొత్తంలో జరుగుతుంది.
తెలుగులో కూడా భారీ మొత్తానికి జరిగిన ఈ సినిమాకి ఇపుడు ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డు ధర పలికినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 80 కోట్లకి పైగానే మొత్తంతో బిజినెస్ డీల్ లాక్ అయ్యినట్టు ప్రస్తుతం టాక్. ఇక ఇది తమిళ సినిమా మొత్తంలోనే అత్యధికం అట. సో బిజినెస్ పరంగా కొత్త లెక్కలనే చూపిస్తున్న కూలీ థియేటర్స్ లో వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.