“RRR” కు రికార్డు స్థాయి బిజినెస్ స్టార్ట్ అయ్యిపోయిందా.?

“RRR” కు రికార్డు స్థాయి బిజినెస్ స్టార్ట్ అయ్యిపోయిందా.?

Published on Oct 14, 2020 10:02 AM IST

టాలీవుడ్ నుంచి రానున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఒకటి. బిగ్గెస్ట్ పీరియాడిక్ అండ్ విజువల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్ర యూనిట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ గా నిలుస్తుంది. ఇపుడు లేటెస్ట్ గా రానున్న కొమరం భీం టీజర్ అంతా ఎదురు చూస్తున్న తరుణంలో మరో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి భారీ స్థాయి బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దాదాపు 400 కోట్ల భారీ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేవలం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులకు 200 కోట్లు పలికింది అని టాక్. ఇదంతా అన్ని భాషల్లో కలిపి అన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఈ టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు