సురేందర్ రెడ్డి బర్త్ డే కానుకగా రేస్ గుర్రం ఫస్ట్ టీజర్

Surender-Reddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. రేపు సురేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10 గంటలకు రేస్ గుర్రం ఫస్ట్ లుక్ టీజర్ ని లాంచ్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని 2014 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. మొట్ట మొదటి సారి అల్లు అర్జున్ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు.

Exit mobile version