యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “రెబల్” చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. చాలా రోజుల తరువాత ప్రభాస్ ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్రంలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ చిత్ర క్లైమాక్స్ కోసం సెట్ లో చిత్రీకరించిన ఫైట్ సన్నివేశాలు చిత్రానికే ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి “ఏ” సర్టిఫికేట్ అందుకుంది. ఈ చిత్రంలో తమన్నా అందాల ఆరబోత చిత్రానికి మరింత బలం చేకూర్చనుంది. “కాంచన” చిత్రంతో హిట్ కొట్టిన లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా సంగీతం కూడా అందించారు. భగవాన్ మరియు పుల్లా రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.