ఈ రోజు సెన్సార్ జరుపుకోనున్న ‘రెబల్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెబల్’. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ రోజు మధ్యాహ్నం రెబల్ మూవీ సెన్సార్ జరగనుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు ఇచ్చే సర్టిఫికేట్ మరియు ఏమన్నా కట్ చేయమని చెప్పిన సన్నివేశాల వివరాలు సాయంత్రం కల్లా అందుబాటులోకి వస్తాయి.

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచి యాక్షన్ సన్నివేశాలు మరియు మాస్ మసాల సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి. మిల్క్ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో ఫుల్ గ్లామరస్ గా కనిపించనున్నారు. దీక్షా సేథ్ మరో కథానాయిక. బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె. భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్ర సెన్సార్ విశేషాలు మాకు అందగానే మీకు తెలియజేస్తాము, కావున 123తెలుగు.కామ్ ని విసిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version