యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సెన్సార్ వారు కత్తిరించిన విషయాలను మీకు అందిస్తున్నాం. పైన ఇచ్చిన ఫోటో చూస్తే కొన్ని భూతు పదాలను మరియు పోలీసు యునిఫార్మ్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలను కత్తిరించినట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ప్రభాస్ సరసన తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదల కానుంది.