పోరాటసన్నివేశాల నడుమ లెజెండ్

పోరాటసన్నివేశాల నడుమ లెజెండ్

Published on Dec 5, 2013 1:50 AM IST

balakrishna-legend

నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమా ప్రస్తుతం నిర్మాణదశలో వుంది. ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్లకు ప్రసిద్ధిగాంచిన బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరికలయికలో వచ్చిన గత చిత్రం ‘సింహా’ వాలే ఈ సినిమాలో కుడా పవర్ ఫుల్ యాక్షన్ సీన్లను ఆశించవచ్చు

అంతే కాక ఈ సినిమాలో కొన్ని ఒళ్ళు గగుర్పుడిచే యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి. అటువంటి సీన్లను ఇటీవలే వైజాగ్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలయ్యబాబు పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. రాధికా ఆప్టే, సొనల్ చౌహాన్ హీరోయిన్స్,

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమాను వారాహి చలనచిత్రం మరియు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

తాజా వార్తలు