‘ఖిలాడీ’ బ్యూటీతో రవితేజ మరోసారి!?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మళ్ళీ తన మార్క్ స్పీడ్ తో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా మాస్ జాతర సినిమా తర్వాత తన నుంచి నెక్స్ట్ సినిమాని దర్శకుడు కిషోర్ తిరుమలతో అనౌన్స్ చేయడం అంతే కాకుండా అక్కడ నుంచి షూటింగ్ కూడా మొత్తం సెట్ చేయడం అంతా చకచకా జరిగిపోతున్నాయి.

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారిలో తన సినిమా తోనే ఎంట్రీ ఇచ్చిన ‘ఖిలాడీ’ బ్యూటీతో మరోసారి నటించనున్నట్టు తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ హయాతి అట. మరి డింపుల్ హయాతి రవితేజతో ఖిలాడీ సినిమా తోనే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ వీరు కలిసి నటించనున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version