ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’లో ఆ బ్యూటీ.. నిజమేనా ?

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా త్రిప్తి దిమ్రిని తీసుకున్నారట. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిప్తి లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ అని పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ప్రస్తుతం ఓ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేక సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version