మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ తర్వాత అసలు ఎటువంటి హేటర్స్ లేని హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ రవితేజ అనే చెప్పాలి. అందరి హీరోల అభిమానులూ రవితేజ సినిమాలు అంటే ఎంతో ఇష్టపడి హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు రవితేజబ్యాడ్ టైమే నడుస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు రవితేజ దర్శకుడు గోపీచంద్ దర్శకత్వంలో “క్రాక్” చిత్రంతో పాటు మరో సినిమా కూడా ఒప్పుకున్నారు.
ఇదిలా ఉండగా మాస్ మహారాజ్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటించే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ సంస్థతో రవితేజ డీల్ కుదుర్చుకున్నట్టు వినికిడి. ఇప్పటికే చాలా మంది స్టార్ నటులు ఈ మధ్య వెబ్ సీరీస్ లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి రవితేజ ఎలాంటి వెబ్ సిరీస్ లో కనిపిస్తారో చూడాలి.