రవితేజ్ ‘క్రాక్’ ఆల్బమ్ బాగా వస్తోందట !

రవితేజ్ ‘క్రాక్’ ఆల్బమ్ బాగా వస్తోందట !

Published on May 3, 2020 2:05 AM IST

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ‘క్రాక్’. కాగా క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే తమన్ సాంగ్స్ తో పాటు షూట్ చేసిన సీన్స్ కు సంబధించిన నేపథ్య సంగీతం మీద వర్క్ మొదలుపెట్టారట. అవుట్ ఫుట్ చాల బాగా వస్తోందని.. తమన్ నుండి మరో సూపర్ హిట్ ఆల్బమ్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని కరోనా తగ్గాక విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజకి క్రాక్ కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు