మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని ఆగష్టు 15న విడులచేయనున్నామని హైదరాబాద్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఈ చిత్ర నిర్మాత తెలిపారు. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
రఘు కుంచె సంగీతం అందిచిన ఈ చిత్రం లోని అన్ని పాటలను భాస్కర భట్ల రాశారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తమ ఆనందాన్ని తెలిపారు. ఈ చిత్రం క్లీన్ ఎంటర్టైనర్ అని పూరి జగన్నాథ్ అన్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.