మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్ర యూనిట్ మొత్తం ఈ నెల 18న బ్యాంకాక్ కి వెళ్లనున్నారు. అక్కడ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ని షూట్ చేయనున్నారు. జూన్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆడియో కూడా జూన్ లోనే విడుదల చేసే అవకాశం ఉంది. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో రవితేజ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పివిపి సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.