మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న సినిమా ‘క్రాక్’. లాక్ డౌన్ తర్వాత గత నెలలో ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. తాజా అప్ డేట్ ఏమిటంటే, ఈ చిత్రం యొక్క మొత్తం టాకీ పార్ట్ నేటితో పూర్తయింది. ప్రస్తుతానికి ఇక ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అలాగే పోస్ట్-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.
కాగా ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, తమ సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన లాస్ట్ సినిమా డిస్కో రాజా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజకి క్రాక్ కీలకం కానుంది. ఇక క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.