ఈ సారి రవితేజ అదిరిపోయే హిట్ కొట్టబోతున్నాడా?

ఈ సారి రవితేజ అదిరిపోయే హిట్ కొట్టబోతున్నాడా?

Published on May 2, 2012 12:45 PM IST


మాస్ మహారాజ రవితేజ ఇటీవల నటించిన దొంగల ముఠా, వీర, నిప్పు చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక నిరాశపరిచాయి. కాని ఈ సారి మాత్రం తన గురి తప్పదంటున్నాడు. శివ డైరెక్షన్లో రవితేజ మరియు తాప్సీ జంటగా నటిస్తున్న ‘దరువు’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గతంలో శౌర్యం, శంఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. తమిళ నటుడు ప్రభు యమధర్మరాజుగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ అంటోనీ సంగీతం అందిస్తున్నాడు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం మే నెల ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు