మాస్ మహారాజ రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సినీ ప్రేమికులను అమితంగా మెప్పించాడు. రవితేజ చేసిన విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర ఇప్పటికీ బాగా పాపులర్. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మేము విన్న తాజా సమాచారం ప్రకారం రవితేజ తన రాబోయే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ వార్తని అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు.
ఈ రోజే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమాకి బాబీ డైరెక్టర్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా కనిపించనుంది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మీకు రవితేజని మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడటం ఇష్టమేనా? మీ సమాధానాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.