విడుదలైన రవితేజ పవర్ టీజర్

Power_raviteja1
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘పవర్’ టీజర్ ఈరోజు విడుదలైంది. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషించాడు. “మాస్ అంటే బస్ పాస్ కాదురా.. ఎవరుపడితే వాడు వాడడానికి.. అధి బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి ..” అంటూ పక్కా మాస్ ఎంటెర్టైనర్ ను అందించబోతున్నట్టు సూచనలు ఇచ్చారు

ప్రస్తుతం ప్రధాన తారాగణం పై పాట చిత్రీకరణ కోసం ఈ బృందం బెంగళూరులో అడుగుపెట్టింది. అక్కడ ప్రముఖ ఓరియన్ మాల్ దగ్గర షూట్ చేస్తున్న ఈ పాట త్వరలో పూర్తికానుంది. కె. ఎస్ రవీంద్ర గతంలో రవితేజకు చన్నాళ్ల తరువాత హిట్ ను ఇచ్చిన ‘బలుపు’ సినిమాకు కధారచయిత. థమన్ సంగీతదర్శకుడు. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్. కోన వెంకట్ డైలాగులు అందించారు. అల్లన్ అమిన్ ఫైట్ మాస్టర్. ఈ సినిమా వేసవిలో మనముందుకు రానుంది.

Exit mobile version