రవితేజ – మెహర్ రమేష్ ల ‘పవర్’ ఆగిపోయిందా?

RAviteja-and-ramesh-meher
మాస్ మహారాజ రవితేజ – మెహర్ రమేష్ కాంబినేషన్లో ‘పవర్’ అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాని వెల్ ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. కానీ తాజాగా ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయింది. మెహర్ తీసిన ‘షాడో’ బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకోవడం, మెహర్ ని విమర్శకులు బాగా విమర్శించడం, సామాన్య ప్రేక్షకులకి కూడా సినిమా నచ్చక పోవడంతో, మెహర్ తో తదుపరి సినిమా చేయాల్సిన నిర్మాతలు వెనక్కి తగ్గారని సమాచారం. ప్రస్తుతం హీరో రవితేజ కూడా గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడి ఉన్నాడు. కావున ఈ సినిమా ఆగిపోయినట్లే అని అంటున్నారు. ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన . మాకు మరింత సమాచారం అందగానే మీకు తెలియజేస్తాము.

Exit mobile version