మంచి ఆనందంలో వున్న మాస్ మహారాజ్

Raviteja
‘విజయానికంటే మధురమైన పదం ప్రపంచంలో ఉండదు’ అని మనం చదువుకునేవుంటాం. ప్రస్తుతం ఇది రవితేజకు కూడా వర్తిస్తుంది. వరుస పరాజయాల తరువాత ‘బలుపు’ సినిమా విజయంతో రవితేజ పరమానందంలో వున్నాడు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా ప్రెస్ మీట్ లో అంతగా మాట్లాడని రవితేజ ఈ సినిమా విజయంతో ఎట్టకేలకు ఆనందంగా మాట్లాడాడు. ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్. గోపిచంద్ మలినేని దర్శకుడు. పెర్ల్ వి పోట్లురి సమర్పణలో పి.వి.పి బ్యానర్ పై విడుదలైన ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తరువాత రవితేజ ‘బలుపు’ రచయితలలో ఒకరైన కె.ఎస్ రవీంద్ర (బాబీ) తో కధాచర్చలలోవున్నాడు. ఈ కొత్త సినిమా ఈ ఏడాది మొదలుకావచ్చు

Exit mobile version