బెంగళూరులో చిందేస్తున్న రవితేజ, హన్సిక

బెంగళూరులో చిందేస్తున్న రవితేజ, హన్సిక

Published on Jan 14, 2014 2:26 AM IST

raviteja_hansika
కె. ఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటెర్టైనర్ లో రవితేజ, హన్సిక మొదటిసారిగా జతకట్టనున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

గతనెల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం పై పాట చిత్రీకరణ కోసం ఈ బృందం బెంగళూరులో అడుగుపెట్టింది. అక్కడ ప్రముఖ ఓరియన్ మాల్ దగ్గర షూట్ చేస్తున్న ఈ పాట త్వరలో పూర్తికానుంది. కె. ఎస్ రవీంద్ర గతంలో రవితేజకు చన్నాళ్ల తరువాత హిట్ ను ఇచ్చిన ‘బలుపు’ సినిమాకు కధారచయిత. థమన్ సంగీతదర్శకుడు. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్. అల్లన్ అమిన్ ఫైట్ మాస్టర్

తాజా వార్తలు