మాస్ మహారాజ రవితేజ ఇటీవల నటించిన చిత్రాలు పరాజయం పాలవుతుండటంతో ట్రాక్ మార్చి తనకు ఇడియట్ తో లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాధ్ తో కలిసి మళ్లీ చేయబోతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఇటీవలే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పిస్తుండగా శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. పూరి, రవితేజ కలిసి మళ్లీ మేజిక్ చేస్తారో లేదో వేచి చూద్దాం.