యామి గౌతం కథను చిత్రంగా చేసిన రవిబాబు

యామి గౌతం కథను చిత్రంగా చేసిన రవిబాబు

Published on Sep 8, 2012 2:18 PM IST


రవిబాబు రాబోతున్న చిత్రం “అవును” యామి గౌతంచెప్పిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గత ఏడాది రవి బాబు మరియు యామి గౌతం “నువ్విలా” చిత్రం కోసం కలిసి పని చేశారు. యామి చెప్పిన భయానకమయిన సంఘటనతో ప్రేరణ పొందిన రవిబాబు “అవును” చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రవిబాబు రామోజీ ఫిలిం సిటీలో సితార హోటల్ లో ఉండేవారు దాదాపుగా 50 రోజుల పాటు ఒంటరిగానే ఉన్నా, రవిబాబుకి ఆ కథ విన్నాక ఏదో మార్పు కనిపించింది. రవిబాబు ఒంటరిగా నిద్రపోవడానికి చాలా భయపడ్డారు లైట్ లు అన్ని వేసి ఉంచి టీవీ ఆన్ లో ఉంచినా కూడా ఫలితం కనిపించలేదు. మధ్య రాత్రిలో హోటల్ నుండి బయటకి వచ్చేసారు. ఇదే కథను ఆయన ప్రేక్షకులతో పంచుకోవాలని అనుకున్నారు అందుకే “అవును” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం యామి గౌతం చెప్పిన కథని ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది.

తాజా వార్తలు