రష్మిక హార్డ్ వర్క్ “పుష్ప” కోసమేనా.?

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం “పుష్ప”‘. బన్నీ చేస్తున్నమొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతుంది. లేటెస్ట్ గా జిమ్ లో కసరత్తులు చేస్తూ ఒక వీడియో వదిలింది. అయితే అది కేవలం తన పర్సనల్ కేర్ కోసం మాత్రమే కాకుండా పుష్ప లో తన రోల్ కోసం అన్నట్టు కూడా తెలుస్తుంది.

అన్ని ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ గా తన ఫిట్నెస్ ను తయారు చేస్తుందట. ఈ చిత్రంలో చిత్తూరు చెందిన యువ జంటగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుక్కు, బన్నీల ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version