ఓటిటిలో అదరగొడుతున్న రష్మిక కొత్త సినిమాల్లో ఒకటి!

ఓటిటిలో అదరగొడుతున్న రష్మిక కొత్త సినిమాల్లో ఒకటి!

Published on Dec 6, 2025 9:00 PM IST

The-Girlfriend Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గానే కాకుండా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కూడా కొన్ని ఈ ఏడాదిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చాయి. అయితే ఈ నవంబర్, డిసెంబర్ రెండు నెలల్లో కొన్ని వారాల గ్యాప్ లోనే ఆమె నుంచి రెండు సినిమాలు ‘థామా’ అలాగే ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే రెండు సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రాలు రెండూ రీసెంట్ గానే ఓటిటి ఎంట్రీ ఇచ్చాయి.

మరి వీటిలో ది గర్ల్ ఫ్రెండ్ కి నెట్ ఫ్లిక్స్ లో అదిరే రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. దీనితో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ అవుతుండగా ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, రావు రమేష్ అలాగే రోహిణిలు సాలిడ్ పాత్రల్లో నటించారు. అలాగే హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించిన ఈ సినిమాను విద్యా కొప్పినీడి అలాగే ధీరజ్ మొగిలినేనిలు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు