తన కెరీర్‌ లోనే పుష్ప ప్రత్యేకమట !


కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో హీరో, హీరోయిన్లు ఇళ్ళ‌ళ్ళో ఖాళీగా ఉంటున్నారు. దీంతో సోష‌ల్ మీడియ‌లో త‌మ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ప‌లు విష‌యాలు పంచుకుంటున్నారు. అయితే ర‌ష్మిక మంద‌న్న కుడి ఐటివలె ఫ్యాన్స్‌ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆశ‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. లాక్‌ డౌన్ తర్వాత చేసే మొదటగా చేసే పని ఏమిట‌ని ఓ ఫ్యాన్ ప్ర‌శ్నించ‌గా.. తన స్నేహితులను వెళ్లి కలుస్తానని.. అలాగే పుష్ప షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది.

కాగా ఇక తన ఫిట్‌‌నెస్ సీక్రెట్ ఏమిటని ఇంకో ఫ్యాన్ ప్ర‌శ్నించ‌గా.. తాను ఎంత బిజీగా ఉన్నా వర్కౌట్స్ చేయడం మాత్రం మాననని చెప్పుకొచ్చింది. ఓ అభిమాని నాకు ఆ దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై ఏ వ‌రం కావాలో కోరుకోమంటే.. రష్మికకు భర్త చేయమని కోరుతాన‌ని చెప్పాడు. దీంతో రష్మిక తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను చూపిస్తూ.. ముందు దీని అనుమతి తీసుకో అంటూ ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది.

ప్రస్తుతం రష్మిక, అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కెరీర్‌లోనే పుష్ప సినిమా ప్రత్యేకమని.. ఎప్పటికి నిలిచిపోతుందని.. ప్రధానంగా ఈ సినిమా ద్వారా రష్మిక నటనలోని మరో కోణం బయటికి వస్తుందట.

Exit mobile version